విరజాజుల వెండి వెన్నెల
విరిసిన ఆ గగనపుటంచున
మరలివెళ్ళిన సంధ్యకాంతుల
వింత సోయగాల నడుమ...
నీ ఒడిలో తలవాల్చి
మనసారా కన్న
ఆ కమ్మని కలల
అలల తాకిడికి తనువొగ్గుతూ....
మరల మరల
నిను నా మదిలో నింపేస్తూ...
నీ ఊహల నా సౌధపు
ముంగిలిలో నువ్వేసిన ఆ
ముగ్గుల ముందర నిల్చొన్నా...!
నీవు రావని తెలిసినా,
నీ కోసం నిరీక్షిస్తూ...!!
చేతినిండా పనుంటుంది... కానీ సందె వేళ.. హాయిగా ఆరుబయట పచ్చగడ్డిమీద పడుకొని ఆకాశంలోని కొత్త కొత్త రంగుల్ని ఆస్వాదిద్దామనిపిస్తుంది... ఏం చేద్దాం మనసు మాటవినదు
ఓ చిన్ని ఊహ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఓ చిన్ని ఊహ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
21, డిసెంబర్ 2008, ఆదివారం
30, అక్టోబర్ 2008, గురువారం
అప్పుడే తెల్లవారాలా....?
నా కనుబొమ్మల
చల్లని తెరల మీద
మృదువైన స్వప్నంతో
నీ బొమ్మని గీద్దామని
అనుకుంటున్న వేళ.....
అప్పుడే తెల్లవారాలా...!!!
నా కల చెదరాలా...???
చల్లని తెరల మీద
మృదువైన స్వప్నంతో
నీ బొమ్మని గీద్దామని
అనుకుంటున్న వేళ.....
అప్పుడే తెల్లవారాలా...!!!
నా కల చెదరాలా...???
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)