చేతినిండా పనుంటుంది... కానీ సందె వేళ.. హాయిగా ఆరుబయట పచ్చగడ్డిమీద పడుకొని ఆకాశంలోని కొత్త కొత్త రంగుల్ని ఆస్వాదిద్దామనిపిస్తుంది... ఏం చేద్దాం మనసు మాటవినదు
4, మార్చి 2009, బుధవారం
ఢిల్లీ - 6
ఢిల్లీ - 6,
మంచి ఫీల్ ఉన్న సినిమా,
నేను స్టేట్మెంట్ ఇవ్వడంలేదు, ఇది నా ఫీలింగ్.
ఈ సినిమా చూడడానికి చాలా అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. చాలా మంది చెప్పారు, 'వద్దురా బాబూ'' అని, నాకు కూడా తీరిక కుదరక అలా అలా వాయిదా వేస్తూనే వచ్చా. చూశాక అనిపించింది, 'ఇన్ని రోజులూ ఎందుకుచూడకుండా మిస్సయ్యా'నని.
నా సినిమా అవరోధాలని పక్కన పెడితే, సునిశితమైన అంశాలని బాగా చిత్రీకరించాడు రాకేశ్.
("అక్స్" ని కాసేపు పక్కన పెడితే మిగిలిన) రెండు చిత్రాలలో కూడా జనాలలో ఒక మెసేజ్ పాస్ చెయ్యటానికిప్రయత్నించాడు. బహుశా నాకు చెప్పిన వాళ్ళకి ఆ మెసేజ్ ఎక్కలేదేమో..!! చెప్పాలంటే చాలా ఉంది. కథ వెనక చాలావర్క్ చేసాడు. రోషన్ (అభిషేక్) కనే కలలు భలే సహజంగా ఉన్నాయి. 'డిల్లీ నుంచి న్యూయార్క్ కి వెళ్ళిపోవడం, అక్కడమళ్ళీ ఇక్కడి టాక్సీలే కనిపించడం, మధ్యలో ఆ అద్దం పట్టుకున్న పిచ్చివాడు రావడం........' బాగుంది, చాలాన్యాచురల్గా ఉంది. 'తన (రోషన్) మనసులో ఒక్క ప్రేమ (బిట్టూ మీద) మత్రమే కాదు, ఇంకా అనేక అంశాలుఉన్నాయి...'ఈ విషయాన్ని కళ్ళకి కట్టినట్టు బాగా చూపించాడు.
'స్వదేశ్' తో పోల్చారు చాలామంది, ఎందుకు అలా పోలుస్తారో అర్థం కాదు, దానికి దీనికి పోలిక పెట్టుకొని సమర్ధిస్తే పర్లేదు, కాని మరీ 'ఏం లేదురా, ఇంకో స్వదేశ్' (నాతో మా ఫ్రెండ్ అన్న మాటలివి) అని తీసిపడేస్తే ఎలా చెప్పండి...? ఐనా ఒకఎన్.ఆర్.ఐ. మీద తీస్తే అది ఇంక స్వదేశ్ ఐపొతుందా..!! (వాడితో వాదిద్దమంటే నేనింకా సినిమా చూడల అప్పటికి...!!)
'కాలా బందర్' - ఈ అంశాన్ని భలే ఎంచుకున్నదు రాకేశ్. చివర్లో (రెండో సినిమాలోలా కాకుండా) చెప్పాలనుకున్నమెసేజ్ ని 'గోబర్' (అతుల్ కులకర్ణి) చేత చెప్పించడం బాగుంది. 'ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు ' అని 'రోషన్' చెప్పడం, దానికి ముగింపు ఇచ్చినట్టో లేక ఇంకో రకంగానో 'గోబర్' 'కాలా బందర్ చనిపోలేదు, మనలోనే ఉంది, ఒకమూల.. మనం దాన్ని చంపాల్సిందిపోయి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నా'మని చెప్తాడు. అక్కడ మూడో వ్యక్తి జనానికివివరించాల్సిన అవసరం ఉంది...ఎంతైనా..!! ఈ మొత్తం కథకి సమాంతరంగా రామాయణాన్ని నడపడం రమణీయంగాఉంది. దేనికైనా మూల కథ అక్కడనుంచే పుట్టింది అన్నట్టు...చెడు మీద మంచి గెలుస్తుంది అన్నట్టు...(వేరే ఏ మతాన్నితక్కువ చెయ్యాలని నా ఉద్దేశ్యం కాదు..ఐనా అన్ని మతాలు చెప్పేది కూడా ఇదే కదా..!!)
ఇంక చివరగా రోషన్ వాళ్ళ తాతయ్య (అమితాబ్) తో మాట్లాడటం కూడా బాగుంది. (అప్పటికి తనకి ఉన్నఅలోచనల్లోంచి పుట్టినట్టు...!)
మొత్తానికి బాగా తీశాడు... సారీ, బాగా చెప్పాడు కథని. ;-)
చివరగా ఒక మాట...
"జర్రే జర్రే మే ఉసీకా నూర్ హై
ఝాక్ ఖుద్ మే వో న తుఝ్సే దూర్ హై!
ఇష్క్ హై ఉస్సే తో సబ్సే ఇష్క్ కర్
ఇస్ ఇబాదత్కా యెహీ దస్తూర్ హై"
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)