10, ఆగస్టు 2010, మంగళవారం

హ్యాపీడేస్ - 2 --- తొలి అడుగుఒక సారి వెళ్ళొచ్చాక మళ్ళీ తొలి అడుగు ఏంటి.. అని అంటారా..!!? అప్పుడు క్లాస్ లోకి వెళ్ళలేదు కదా అందుకే ఇదే నా తొలి అడుగు ఔతుంది. ( అని నా ఫీలింగ్ :-) )
మొత్తానికి తొమ్మిది నుంచి స్ట్రగుల్ చేస్తే పది ఐంది కాలేజ్ కి వెళ్ళేప్పటికి. మిగతావాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే మేము మాత్రం తెలిసినట్టుగా (ఆల్రెడీ ఒక సారి పరిచయం ఐంది కదా మా అడవి :-) ) డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లిపోయాం. కానీ మాకు ఒక ట్విస్ట్ అక్కడ. ప్రిన్సిపాల్ గారు సెమినార్ హాల్లో మీటింగ్ మొదలు పెట్టేసారంట, ECE కి మార్నింగ్ సెషన్ అంట. చచ్చీ చెడి ఒక సారి ఈ ఆఫీస్ కనుక్కున్నాం, మళ్ళీ ఆ సెమినార్ హాల్ ఎక్కడో కనుక్కొని చావాలా అని తిట్టుకొని క్లర్క్స్ ని వాళ్ళని వీళ్ళని పట్టుకొని మొత్తానికి హాల్ చేరుకున్నాం. ఆంధ్రాలోనే ఇలా జరుగుతుంది అనుకుంట. మీటింగ్ స్టార్ట్ అయ్యి అరగంట ఐంది, కానీ మొదటి వరస మాత్రం నిండలేదు. అదే మా అదృష్టం లెండి. వెళ్లి కూర్చుని అయన చెప్పే మాటలు వింటున్నాం. నాకు అందులో వినబడ్డ (ఊత)పదాలు అవర్ కాలేజ్’, ‘డిసిప్లిన్, నెంబర్ 1( కృష్ణ సినిమా కాదు, మా కాలేజ్ ర్యాంకింగ్ అంట ). ఆ తర్వాతి సంవత్సరాలలో అవే అలవాటైపోయాయిలెండి :-) .
మొత్తానికి మీటింగ్ అవగొట్టారు మా ప్రిన్సిపాల్ ( భోజనం టైం అయ్యిందిలెండి :-) ). డాడీ నేను కలసి అప్లికేషన్ ఫిల్ చేసేసి, తదుపరి భోజనం కూడా చేసాం ( మా కన్నా కాలేజ్ మ్యాప్ బాగా తెలిసిన వాళ్ళని పట్టుకొని క్యాంటీన్ కి వెళ్ళాంలెండి). డాడీ కి పని ఉంటే విజయవాడ వెళ్లారు. నేను ఇప్పుడు ఒంటరిని కాలేజీ లో  :-( (18 ఏళ్లు వచ్చాయి, ఇంకా నాన్నకూచి ఏంటి? :-P ‘అని అనకండి. నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్ మేము మాటలతోనే కొట్టుకుంటాం :-D)
నేను కూడా నాన్నతో పాటే వెళ్దాం అనుకున్నా, ప్చ్... కుదరదు, మధ్యాహ్నం ఖాళీగా ఉంటే మా (కాబోయే) స్టూడెంట్స్ ఏమైపోతారో అని ప్రిన్స్(పాల్) గారు ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టేసారు :-( . బుక్స్ లేవుగా ఏం చెప్తారు ఎలా చెప్తారు అని అనుకుంటున్నారా!  అదేదో మెసేజ్ లో చెప్పినట్టు ఆంధ్రా (ఫ్యూచర్) ఇంజినీర్స్ కి బుక్స్ తో పనిలేదులెండిJ.
ఎటు పోవాలో తెలీక అటూ ఇటూ తచ్చాడుతుంటే ఎవరో నన్ను ఒక రూం లోకి నెట్టేసారు x-(. లోపల ఆయనెవరో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని ఇప్పుడే అడగద్దు. నాకు కూడా ఏం అర్థం అవలేదు కదా :-) ). నన్ను లోపలకి నెట్టేసిన ఆయనే మిగాతావాళ్ళని కూడా నేట్టేసారనుకుంట, హాల్ అంతా నిండిపోయింది. సరే అనుకొని ఒక మూల కూర్చున్నా. ఇంతలో అయన మాటల్లో ఒకటి నా చెవిన పడింది అటానమస్. ఎక్కడో విన్నా.... ఎక్కడో విన్నా... అని బుర్రగోక్కుంటుంటే బల్బ్ వెలిగింది :-) , పొద్దున్న సెమినార్ హాల్ లో విన్నా. హా, రైట్, అక్కడే విన్నా. మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు, మా కాలేజ్ అటానమస్ ఔతున్దంట. (అఫిలియేషన్ అంటేనే పూర్తిగా అర్థం తెలిదు నాకు :-(, ఇంక ఈ కొత్త పదానికి ఏం తెలుస్తాది చెప్పండి.) నా (లాంటివాళ్ళ) బాధ గమనించిన ప్రిన్స్ గారు వివరించడం మొదలుపెట్టారు. అయన చెప్పిన ఆ రెండు గంటల విశ్లేషణాత్మకమైన వివరణ సారాంశం ఏంటంటే... షెడ్యూల్ మాది, సిలబస్ మాది, మార్క్స్ మావి. ఇంకా విపులంగా చెప్పాలంటారా! అయితే వినండి. అనగనగా ఒక కోతి. అది కల్లు తాగిందంట, వస్తుంటే దార్లో ముల్లు గుచ్చుకుందంట. అది సంగతి. సో, ఇప్పుడు మా (కాలేజీ) స్థితి అది అన్నమాట.
నిండా మునిగినోడికి చలి ఉండ(కూడ)దు అని అనేస్కోని, పక్కనోళ్ళని పరికించడం మొదలెట్టా. కొంతమంది కళ్ళు అప్పగించి మరీ వింటున్నారు, కొంత మంది నాలాగే :-). పాపం మా సార్ మాత్రం ఏ ముక్కా వదలకుండా అన్ని చెప్తున్నారు.
మొదటిరోజు పరిచయాలు మాత్రం గుర్తుండిపోతాయండి. ఇది నిజం. ఏదో ఒక ఇంప్రెషన్, రిసల్ట్ మాత్రం ఆ సంఘటన కానీ ఆ మనిషి కానీ మెమరీ లో ఉండిపోవడం. ఏదో లవ్ స్టొరీ చెప్తున్నా అనుకోకండి :-D, హిహి, మొదటిరోజు నాకు పరిచయమైంది మాత్రం స్పార్టా(రోహిత్). వీడు ఇంజినీరింగ్ ఏంటి? టెన్త్ అంటే సూట్ ఔతాదేమో!అనుకున్నా. పాపం వీడికి తొందర ఎక్కువ. నేనే ముందు మాట్లడెయ్యాలిఅనే ఆత్రం. బాగా యాక్టివ్.
వీడి కంటే ముందు ఇంకొకడ్ని చూసా, రావ్ :-) (వెంకట్ అలియాస్ ప్రసాదరావ్) కానీ వాడు మా బ్రాంచ్ అనుకోలేదులెండి. మనిషిని చూస్తే పాపం జాలేసింది. నాకన్నా బక్కగా ఉన్నాడు. వాడ్ని చూసి CSE అనుకున్నా, నా అంచనా తప్పు కాదులెండి. వాడొక కంప్యూటర్ మానియాక్ :-). హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఏ డౌట్ ఉన్నా వాడ్ని అడగండి, చెప్పేస్తాడు.
అలా మొదటిరోజు కొత్త పరిచయాలతో కొత్తగా, క్లాస్ రూం తో భయంగా, తెలియని పద్ధతులతో భయంకరంగా గడిచిపోయింది. ఏదేమైతేనేం, నేను ఇంక ఖాళీ కాదు - ఆనందం, బాధ కలిపిన కొత్త ఫీలింగ్ అది.
గుండెల్లో భయం దాగున్నా,
ఆకాశంలో ఎగరాలన్న
ఆ కోరికే తెచ్చిపెట్టె నా
కళ్ళలో కొత్త వెలుగు
అందుకే ఈ తొలి అడుగు.
సశేషం...

22, జూన్ 2010, మంగళవారం

హ్యాపీ డేస్ - 1పెనవేసుకున్న పరిచయాలెన్నో
కలిసి గోల చేసిన క్షణాలెన్నో
ఒక్కో క్షణం అక్షరం
ఆ ఆస్వాదనతో చిరంజీవులం మేం...!

ఇంజనీరింగ్ కాలేజీ....
ర్యాగింగ్ బాగా చేస్తారంట! ఎక్జామ్స్ కి మనమే చదువుకోవాలంట (12 ఏళ్ల అలవాటుకి విరుద్ధంగా)! సైట్ బాగా కొట్టొచ్చంట! లెక్చరర్స్ లైట్ అంట!..... ఇవే నా ముందున్న ఫీలింగ్స్... నాలుగేళ్ల క్రితం.
మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పొద్దున్నే లేవాల్సి వచ్చింది. టైం అవుతుంది అని కాదు, ఏదో కొత్త ప్రపంచంలోంకి పడిపోయినట్టు, చుట్టూ అందరూ పెదపే..ద్ద మనుషులు నడుం మీద చేతులేస్కోని నాకోసం కాస్కొని చూస్తున్నట్టు..., బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తుంటే, వెనకనుంచి ఎవరో అరిచేసరికి ఉలిక్కిపడి లేచా. అది కలో, కాసేపట్లో నిజమయ్యే భ్రమో తేల్చుకోలేని సందిగ్ధం.
5-30 కి ఎవడైనా లేస్తాడా...? అసలు అలా లేస్తే వాడు చదివేది ఇంజనీరింగేనా..? లేస్తే లేచాడు, 7-30 కి కాలేజిలో ఉండాలా? ఇదేం కాలేజ్...!!? ఫ్రెండ్స్ కామెంట్స్.  ఎమ్సెట్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఇంత పొద్దున్నే లేవలేదు. పర్లేదు థ్రిల్లింగ్ గానే ఉంది. పొద్దున్నే లేవడం=బస్ స్టాప్ కి వెళ్లి వెయిట్ చేయడం-గంటసేపు ప్రయాణం. ఇట్స్ కూల్.
పొద్దున్నే ప్రకృతి అందాలు చూసి పరవశించాం. అఫ్కోర్స్, నిద్రపోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. కానీ తెల్లవారుఝామున హైవే మీద ప్రయాణం, చుట్టూ అంత పచ్చనిదనమే (నాలుగేళ్ళ క్రితం NH-5 ఎక్స్టెండ్ చేయకముందు), ఆ అంతులేని పచ్చదనం చివర్లో అందమైన ఇనబింబం. ఇంత అందమైన ప్రకృతి ఆస్వాదనలో ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియలేదు.
గుర్రుపెట్టి నిద్దరోతున్నోణ్ణి
గుచ్చి లేపే సంధ్యా కిరణాలు
ఐపాడ్ లో పాటల్ని
మింగేసే మా బస్సు గుర్ గుర్ లు
బయట పడే వర్షాన్ని ఆపలేని
మా బస్సు మెయిన్టెనెన్స్
మా బండి వేగాన్ని తగ్గిస్తూ
ఆ టోల్ గేట్ డిస్టర్బెన్స్
అన్నీ ఇబ్బందులే అయినా
ఆ ఆనంద క్షణాలు
ఆ మధురానుభూతులు
తిరిగిరావు... చెదిరిపోవు
కానీ మొదటిరోజు మాత్రం ఒక మరిచిపోలేని అనుభూతి. జీవితంలో తొలి అనుభవాలు అలా గుర్తుండిపోతాయేమో.
మొదటిరోజు కాలేజ్ లో దిగాక అంత కొత్తగా ఉంది. కొత్త బంగారులోకం కాదు. కొత్త కంగారులోకం అది.
*   *   *   *   *
కౌన్సిలింగ్ అయ్యాక ఒకసారి కాలేజ్ చూసొద్దామని నాన్న, నేనూ బయల్దేరాం. KLCE ...... అడ్రస్ తెలీదు. ఫోన్ చేస్తే రెండుసార్లు రెండు దార్లు చెప్పారు. GNT-VIJ, GNT-TEL. సర్లే మధ్యలో ఉంది కదా అని మంగళగిరిలో దిగేసాం. అక్కడ ఒక కండక్టరుని అడిగితే దారి చెప్పారు.


మాంత్రికుడు వాడి ప్రాణం దాచినట్టు, ఎక్కడో విసిరేసినట్టు ఉంది మా కాలేజ్. ఎంట్రన్స్ లో బోర్డ్ చాలా పాతది. గేటు మాత్రం కోట గుమ్మం లాగా ఉంది. అక్కడే భయం మొదలైంది. లోపల కెళ్తే ఒక్క బిల్డింగూ కనబడలేదు.అంతా చెట్లే, గ్రీ...న్. ఇంక నాలుగేళ్ళు ఈ అడవితల్లికి అంకితం నా జీవితం అనుకున్నా.సశేషం...

8, జూన్ 2010, మంగళవారం

P.S. I Love You

'happy days' మొదలుపెట్టాక ఇంకా ఏ పోస్ట్ చేయకూడదు అని ఆ పాత స్మృతులని గుర్తుకు తెచ్చుకునే సమయంలోనే ఈ సినిమా - P.S. I Love You - చూసా. ఆ తర్వాత కలిగిన ఫీల్ కి రాయకుండా ఉండలేకపోయా. అంత బాగుంది ఈ సినిమా. కాన్సెప్ట్ భలే ఉంది.మ్మ్ భలే అనడం కంటే మంచి ఫీల్ ఇచ్చేలా ఉంది అనడం సూట్ ఔతుంది.
కథ మొత్తం చెప్పడం బాగోదు. టూకీగా ఏంటి అంటే, ప్రేమించి పెళ్లి చేస్కున్న జంట, భర్త చనిపోతాడు. ఆ చెడు నిజాన్ని స్వీకరించలేదు ఆ అమ్మాయ్. అయన ముందుగానే తన భార్య కి కొన్ని బహుమతులు కొన్ని ఉత్తరాలు రాసి వాటిని తనకి అందేలాగా ఏర్పాటు చేస్తాడు.
ఆ ఉత్తరాలే ఆమెని నడిపిస్తాయి. ఒంటరితనం నుండి దూరం చేస్తాయి. ఏ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం చేయలేని తనకి తన ప్యాషన్ ఏంటో తెల్సుకునేలాగా చేస్తాయి.
వీలు కుదిరితే చూడండి.
అన్నట్టు మర్చిపోయాను, అయన రాసే ప్రతి ఉత్తరం లో చివరగా రాసే ఆ పి.ఎస్ ఏ ఈ సినిమా టైటిల్. - P.S. I Love You
క్యాప్షన్ కూడా చాల బాగుంది - sometimes there's only one thing left to say


ఈ సినిమా చూసిన తర్వాత చాలాసేపు అదే ఫీల్ లో ఉన్నా.
ఆ సమయంలో పేపర్ మీద పెన్ను పెడితే దగ్గరయిన అక్షరాలే ఇవి.

*********************************

నా అనుభూతులలో నిలిచిపోయిన
నీ కౌగిలిలోని వెచ్చదనాని కేం తెలుసు
నా తనువు ఒంటరిగా ఉందని!!

తొలిముద్దు ముద్రలను మరువనంటున్న
నా పెదవుల కేం తెలుసు
ఆ అమృతం అయిపోయిందని!?

పీడకలతో నిద్రపట్టక నీకై వెతికే
నా చేతుల కేం తెలుసు
నీ విక్కడ లేవని, ఇక రావనీ..!!?

కానీ,
నీతో గడిపిన క్షణాలని పదిల పరచుకున్న
యీ హృదయం చెప్తుంది,
జ్ఞాపకాల తెరల మాటున దాగున్నది నీవేనని...
ఈ ఎద సడి నీ మాటలదని..!!!

p.s. i love you :-) :-(

10, మే 2010, సోమవారం

Happy Days

కొత్త పుస్తకం పేజీల వాసన
ఓ అందమైన అనుభూతి.
మొదటిసారి తెరిచేవరకే
ఆ కొత్తదనం, ఆ కమ్మదనం.
ఒకసారి రాసాక,
ఆ అనుభూతే అనుభవం.
కానీ మనసు పుస్తకం...
ప్రతి పేజీ లిఖితమే,
అయినా...
ఆ నూతనత్వం చెరిగిపోదు
ఆ కమ్మదనం చెదిరిపోదు
...........
తల్చుకున్న ప్రతిసారీ


జ్ఞాపకాల పుటల్లోకి...

3, డిసెంబర్ 2009, గురువారం

అధరాంజలిజాబిలి వెన్నెలలో
కోనేటి కలువలా
నా ముంగిట విచ్చుకున్న
నీ అందాన్ని
చూస్తూండిపోయిన నన్ను
క్షణకాలంలో
చెంతకు లాక్కున్నావు...
నీ కౌగిట బందించావు...!
అమృతం తాగిన పెదవులతో
నన్ను తాకి అమరుణ్ణి చేశావు...!!

27, మే 2009, బుధవారం

సమయమే తెలీకుండా...!!

క్లాసు పక్కనెట్టి
కాలేజీ క్యాంటీన్లో
స్క్వేర్ టేబుల్ మీద
రౌండ్ టేబుల్ ఫార్మ్ చేసి
ప్లేటు నిండా పూరీతో
నోటి నిండా కబుర్లతో
చిట్చాట్ మొదలెడితే...

లెక్చరర్ లీవులో,
లాస్టవర్ క్లాసులో,
బ్యాక్ బెంచ్ అడ్డాలో
నోట్బుక్ అడ్డుగా...
నిన్న సెకండ్ షో సిన్మా మీద
రివ్యూలు మొదలెడితే...

ఈవెనింగ్ చాట్ దగ్గర
చేతిలో ప్లేటుతో
ప్లేటులో చాటుతో
స్టాండేసిన బైక్ మీద ఆనుకుని
నోటాపిక్నే టాపిక్కనుకుని
జోకేయ్యడం మొదలెడితే...

మనసు మాటల్లో మునిగిపోదూ...!
సమయమే తెలీకుండా...!!

25, ఏప్రిల్ 2009, శనివారం

ఓ మై లేట్ ఇన్విజిలేటర్..!!

ఓ మై లేట్ ఇన్విజిలేటర్..!!
అవసరమా ఆ చేతికి వాచీ?
ఏ ఊళ్ళో కొన్నారు స్వామీ..!?
తొమ్మిదిన్నరదాకా నడవడం
ఆ పిమ్మట పరిగెత్తడం! :-o
ఎక్కడా చూడలేదయ్యా!!
మీ తోటి ఇన్విజిలేటర్
తొమ్మిదిన్నరకే
హాల్లోకి పరిగెత్తుకొస్తే......
పావుగంట కొచ్చావ్
రాగానే ఆవులించావ్
సంతకం పెట్టడానికి చచ్చావ్
అంతలో ఎమొచ్చిందో......
సగం టైం అయ్యిందన్నావ్..!!
ఆ గొంతు వినగానే
నా పెన్ను రాయనంది!
జడుసుకుందనుకుంట పాపం!! :-(
మేమంటే నీకెందుకంత కోపం!?
అరగంట ముందే అడిషనల్స్ ఆపావ్
నీ ఆధిపత్యం చూపావ్...
నా పక్కనోళ్ళని బయటకి పంపావ్.
అప్పటిదాకా నడిచిన వాచీ
ఎలా పరిగెట్టిందయ్యా....!! :-o
గూగుల్ కంటే ఐదు నిమిషాలు
ముందున్న నాకంటే....
పది నిమిషాలు
ఎల గెంతిందయ్యా....! :-(
టైమప్ అన్నావ్...!
థమ్సప్ ఎమో అనుకొని పైకి చూశా,
వెనకనుంచి చెయ్యేశావ్..
మళ్ళీ భయపెట్టావ్,
నా పేపర్లు లాక్కున్నావ్.
నా వాచీ చూపిద్దామనుకున్నా..
ఈలోపే జంపయ్యావ్...!! :-o
పక్క రూం లోకి చూసా...
ఒకడు కన్నేగరేశాడు..
ఒళ్ళు మండీ నా వాచీ విసిరేశా,
టాటాని తిట్టుకున్నా,
మళ్ళీ తీసి పెట్టుకున్నా....
రేపు నువ్వు రావనే నమ్మకంతో... :-D