27, మే 2009, బుధవారం

సమయమే తెలీకుండా...!!

క్లాసు పక్కనెట్టి
కాలేజీ క్యాంటీన్లో
స్క్వేర్ టేబుల్ మీద
రౌండ్ టేబుల్ ఫార్మ్ చేసి
ప్లేటు నిండా పూరీతో
నోటి నిండా కబుర్లతో
చిట్చాట్ మొదలెడితే...

లెక్చరర్ లీవులో,
లాస్టవర్ క్లాసులో,
బ్యాక్ బెంచ్ అడ్డాలో
నోట్బుక్ అడ్డుగా...
నిన్న సెకండ్ షో సిన్మా మీద
రివ్యూలు మొదలెడితే...

ఈవెనింగ్ చాట్ దగ్గర
చేతిలో ప్లేటుతో
ప్లేటులో చాటుతో
స్టాండేసిన బైక్ మీద ఆనుకుని
నోటాపిక్నే టాపిక్కనుకుని
జోకేయ్యడం మొదలెడితే...

మనసు మాటల్లో మునిగిపోదూ...!
సమయమే తెలీకుండా...!!

8 కామెంట్‌లు:

  1. చిట్చాట్,రివ్యూ,జోకులతో గడిపేస్తే కాలాన్ని
    చదువుకెప్పుడు కేటాయిస్తావు సమయాన్ని
    పెట్టుకున్నారు తల్లిదండ్రులు నీపై ఆశల్ని
    నువ్వు చిలకరిస్తున్నావు వారి ఆకాంక్షలపై నీళ్ళని
    ఇలా చేస్తే మరి ఉంటుందా ఉజ్జ్వల భవిష్యత్తు.

    రిప్లయితొలగించండి
  2. సార్ మేము ఈ కాలం స్టూడెంట్స్,
    ఎప్పుడూ అలా చిట్చాట్స్‌తోనే గడిపెయ్యం...
    అలాగని పుస్తకాల్లో మునిగిపోం...
    లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ చదవడం అన్నది మా పాలసీ....
    (జోక్స్ వేసేప్పుడు అరెరె టైం ఐపోతుంది అనుకుంటే ఏం ఉంటుంది సార్ జోక్ లో ఎంజాయ్‌మెంట్)
    anyway thanks for your suggestion
    :-)

    రిప్లయితొలగించండి
  3. దేనిదారి దానిదే ...రెండూ ఉండాలి కదూ నిశాంత్ !
    అసలు నీ బ్లాగు పేరే అది !

    రిప్లయితొలగించండి
  4. asalu naku pedda doubt andaru memu ee kalam antaru...asalu appti vallaki ippativallaki emina difference vunda...............

    రిప్లయితొలగించండి
  5. @పరిమళం
    మరేనండి..... అలా కాకపోతే కష్టం కదా.. ;-) :-)
    @వినయ్
    లేకేమండి...
    అది ఆ కాలం..ఇది ఈ కాలం...
    కాలంతో పాటు మనిషి కుడా మరుతున్నాడు కదండీ....
    తాతగారికి సెల్‌ఫోన్ తెలీదు..
    మాటలంటే అరుగుమీద నలుగురు కలవడమే
    మరి ఇప్పుడో... నలుగురూ నాలుగు దేశాల్లో ఉన్న సరే కాన్‌ఫెరెన్స్ కాల్లో అందరూ ఒకే చోట...
    :-)
    @పద్మార్పిత
    ఇంకా ఒక సంవత్సరమేనండి... :-(
    (ఐనా పర్లా... ఇంకా ఒక సంవత్సరం ఉంది కదా...అనేస్కుంటూ హాపీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా.. :-) )

    రిప్లయితొలగించండి