ఓ మై లేట్ ఇన్విజిలేటర్..!!
అవసరమా ఆ చేతికి వాచీ?
ఏ ఊళ్ళో కొన్నారు స్వామీ..!?
తొమ్మిదిన్నరదాకా నడవడం
ఆ పిమ్మట పరిగెత్తడం! :-o
ఎక్కడా చూడలేదయ్యా!!
మీ తోటి ఇన్విజిలేటర్
తొమ్మిదిన్నరకే
హాల్లోకి పరిగెత్తుకొస్తే......
పావుగంట కొచ్చావ్
రాగానే ఆవులించావ్
సంతకం పెట్టడానికి చచ్చావ్
అంతలో ఎమొచ్చిందో......
సగం టైం అయ్యిందన్నావ్..!!
ఆ గొంతు వినగానే
నా పెన్ను రాయనంది!
జడుసుకుందనుకుంట పాపం!! :-(
మేమంటే నీకెందుకంత కోపం!?
అరగంట ముందే అడిషనల్స్ ఆపావ్
నీ ఆధిపత్యం చూపావ్...
నా పక్కనోళ్ళని బయటకి పంపావ్.
అప్పటిదాకా నడిచిన వాచీ
ఎలా పరిగెట్టిందయ్యా....!! :-o
గూగుల్ కంటే ఐదు నిమిషాలు
ముందున్న నాకంటే....
పది నిమిషాలు
ఎల గెంతిందయ్యా....! :-(
టైమప్ అన్నావ్...!
థమ్సప్ ఎమో అనుకొని పైకి చూశా,
వెనకనుంచి చెయ్యేశావ్..
మళ్ళీ భయపెట్టావ్,
నా పేపర్లు లాక్కున్నావ్.
నా వాచీ చూపిద్దామనుకున్నా..
ఈలోపే జంపయ్యావ్...!! :-o
పక్క రూం లోకి చూసా...
ఒకడు కన్నేగరేశాడు..
ఒళ్ళు మండీ నా వాచీ విసిరేశా,
టాటాని తిట్టుకున్నా,
మళ్ళీ తీసి పెట్టుకున్నా....
రేపు నువ్వు రావనే నమ్మకంతో... :-D
పైకవిత సరదాగా ఒక విధ్యార్ధి పాయింట్ ఆఫ్ వ్యూని చెపుతుంది. క్రిందిది ఒక ఇన్విజిలేటర్ పాయింట్ ఆఫ్ వ్యూని చెపుతుంది. రెండూ భిన్న వస్తువులు కనుక ఒకచోటే ఉంటే బాగుంటుందని ఇక్కడ ఇస్తున్నాను. take is easy my friend.
రిప్లయితొలగించండిఇన్విజిలేటర్ మనోగతం
యేడాది జీవితకాలాన్ని
పదికాగితాలు నిర్ధేశిస్తాయిక్కడ .
పరీక్ష వ్రాయటం అంటే
విజ్జానాన్నినెత్తి కెత్తుకొని,
మూడు గంటల మొహాన
కుమ్మరించటమే.
ఈ మూడు గంటల కోసమేకదా
మనసుని పంజరంలోపెట్టేసి,
శరీరాన్ని శుష్కింపచేసి
మెదడుని గచ్చకాయని చేసి
కాలమనే గచ్చుపై అరగదీయటం.
తెలిసిన ప్రశ్నలొస్తే
గంటల ముల్లు తూరీగ రెక్కలు
ధరిస్తుంది.
ప్రశ్నలు ప్రశ్నలలాగె మిగిలితే
సెకండ్లముల్లు నత్తగుల్లని
తొడుక్కుంటుంది.
పరిక్షా హాలులో
అప్పుడప్పుడు, అక్కడక్కడా
సంజ్ఞలు, సంకేతాలు,
గుసగుసలు, దొంగచూపులు,
వాళ్లందరినీ దొంగలను,
నన్నేమో పోలీసును చేస్తాయి
ఎంత నైతిక హీనత్వం?
పరీక్షవగానే పిల్లలకెంత రిలీఫో!
తొమ్మిదినెలల బరువుని
దించుకొన్న తల్లి కన్నులలోని
వెలుగంత రిలీఫ్.
బొల్లోజు బాబా
:-) nice sir...
రిప్లయితొలగించండి>>రేపు నువ్వు రావనే నమ్మకంతో...
రిప్లయితొలగించండి:))
chala chala bagundi..loved it a lot :)
రిప్లయితొలగించండి