7, ఏప్రిల్ 2009, మంగళవారం

కాలమా....!! ఇది నీ జాలమా!!?

కనుమూసి తెరిచేలోపు
అలా ఎలా గడచిపోతావు?
గతిని తిప్పినా...స్థితిని మార్చినా..
మరల యేల వెనుదిరిగిరావు?

కలల పందిరి కట్టుకుంటుంటే
నెమ్మదిగా నడిచావు...
కనులు తెరిచి మేల్కొనేసరికి
నీ దారిన పరిగెడతావేం?

కొత్త బంధాల్ని పుట్టిస్తావు..
పెనవేసుకోనిస్తావు...
ముడిపెట్టి మధ్యలోనే
ఎందుకలా తుంచేస్తావు?

కనువిప్పు కలిగేలోపే
కల్లోలం సృష్టిస్తావు...
క్షణకాలంలో మళ్ళీ
కవ్వించి పోతావు........!!

కాలమా....!! ఇది నీ జాలమా!!?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి