'happy days' మొదలుపెట్టాక ఇంకా ఏ పోస్ట్ చేయకూడదు అని ఆ పాత స్మృతులని గుర్తుకు తెచ్చుకునే సమయంలోనే ఈ సినిమా - P.S. I Love You - చూసా. ఆ తర్వాత కలిగిన ఫీల్ కి రాయకుండా ఉండలేకపోయా. అంత బాగుంది ఈ సినిమా. కాన్సెప్ట్ భలే ఉంది.మ్మ్ భలే అనడం కంటే మంచి ఫీల్ ఇచ్చేలా ఉంది అనడం సూట్ ఔతుంది.
కథ మొత్తం చెప్పడం బాగోదు. టూకీగా ఏంటి అంటే, ప్రేమించి పెళ్లి చేస్కున్న జంట, భర్త చనిపోతాడు. ఆ చెడు నిజాన్ని స్వీకరించలేదు ఆ అమ్మాయ్. అయన ముందుగానే తన భార్య కి కొన్ని బహుమతులు కొన్ని ఉత్తరాలు రాసి వాటిని తనకి అందేలాగా ఏర్పాటు చేస్తాడు.
ఆ ఉత్తరాలే ఆమెని నడిపిస్తాయి. ఒంటరితనం నుండి దూరం చేస్తాయి. ఏ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం చేయలేని తనకి తన ప్యాషన్ ఏంటో తెల్సుకునేలాగా చేస్తాయి.
వీలు కుదిరితే చూడండి.
అన్నట్టు మర్చిపోయాను, అయన రాసే ప్రతి ఉత్తరం లో చివరగా రాసే ఆ పి.ఎస్ ఏ ఈ సినిమా టైటిల్. - P.S. I Love You
క్యాప్షన్ కూడా చాల బాగుంది - sometimes there's only one thing left to say
ఈ సినిమా చూసిన తర్వాత చాలాసేపు అదే ఫీల్ లో ఉన్నా.
ఆ సమయంలో పేపర్ మీద పెన్ను పెడితే దగ్గరయిన అక్షరాలే ఇవి.
*********************************
నా అనుభూతులలో నిలిచిపోయిన
నీ కౌగిలిలోని వెచ్చదనాని కేం తెలుసు
నా తనువు ఒంటరిగా ఉందని!!
తొలిముద్దు ముద్రలను మరువనంటున్న
నా పెదవుల కేం తెలుసు
ఆ అమృతం అయిపోయిందని!?
పీడకలతో నిద్రపట్టక నీకై వెతికే
నా చేతుల కేం తెలుసు
నీ విక్కడ లేవని, ఇక రావనీ..!!?
కానీ,
నీతో గడిపిన క్షణాలని పదిల పరచుకున్న
యీ హృదయం చెప్తుంది,
జ్ఞాపకాల తెరల మాటున దాగున్నది నీవేనని...
ఈ ఎద సడి నీ మాటలదని..!!!
p.s. i love you :-) :-(