'happy days' మొదలుపెట్టాక ఇంకా ఏ పోస్ట్ చేయకూడదు అని ఆ పాత స్మృతులని గుర్తుకు తెచ్చుకునే సమయంలోనే ఈ సినిమా - P.S. I Love You - చూసా. ఆ తర్వాత కలిగిన ఫీల్ కి రాయకుండా ఉండలేకపోయా. అంత బాగుంది ఈ సినిమా. కాన్సెప్ట్ భలే ఉంది.మ్మ్ భలే అనడం కంటే మంచి ఫీల్ ఇచ్చేలా ఉంది అనడం సూట్ ఔతుంది.
కథ మొత్తం చెప్పడం బాగోదు. టూకీగా ఏంటి అంటే, ప్రేమించి పెళ్లి చేస్కున్న జంట, భర్త చనిపోతాడు. ఆ చెడు నిజాన్ని స్వీకరించలేదు ఆ అమ్మాయ్. అయన ముందుగానే తన భార్య కి కొన్ని బహుమతులు కొన్ని ఉత్తరాలు రాసి వాటిని తనకి అందేలాగా ఏర్పాటు చేస్తాడు.
ఆ ఉత్తరాలే ఆమెని నడిపిస్తాయి. ఒంటరితనం నుండి దూరం చేస్తాయి. ఏ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం చేయలేని తనకి తన ప్యాషన్ ఏంటో తెల్సుకునేలాగా చేస్తాయి.
వీలు కుదిరితే చూడండి.
అన్నట్టు మర్చిపోయాను, అయన రాసే ప్రతి ఉత్తరం లో చివరగా రాసే ఆ పి.ఎస్ ఏ ఈ సినిమా టైటిల్. - P.S. I Love You
క్యాప్షన్ కూడా చాల బాగుంది - sometimes there's only one thing left to say
ఈ సినిమా చూసిన తర్వాత చాలాసేపు అదే ఫీల్ లో ఉన్నా.
ఆ సమయంలో పేపర్ మీద పెన్ను పెడితే దగ్గరయిన అక్షరాలే ఇవి.
*********************************
నా అనుభూతులలో నిలిచిపోయిన
నీ కౌగిలిలోని వెచ్చదనాని కేం తెలుసు
నా తనువు ఒంటరిగా ఉందని!!
తొలిముద్దు ముద్రలను మరువనంటున్న
నా పెదవుల కేం తెలుసు
ఆ అమృతం అయిపోయిందని!?
పీడకలతో నిద్రపట్టక నీకై వెతికే
నా చేతుల కేం తెలుసు
నీ విక్కడ లేవని, ఇక రావనీ..!!?
కానీ,
నీతో గడిపిన క్షణాలని పదిల పరచుకున్న
యీ హృదయం చెప్తుంది,
జ్ఞాపకాల తెరల మాటున దాగున్నది నీవేనని...
ఈ ఎద సడి నీ మాటలదని..!!!
p.s. i love you :-) :-(
మీ కవిత చాలా బాగుంది. Really Touching.
రిప్లయితొలగించండిమీ కవిత చాలా బాగుంది. Really Touching.
రిప్లయితొలగించండిఅయితే ఈ సినిమా చూడాలన్నమాట! మీ కవిత బాగుంది :-)
రిప్లయితొలగించండిbaagundi mee kavita
రిప్లయితొలగించండిchala baga rasaaru
రిప్లయితొలగించండిమొన్నెక్కడో బ్లాగులో ఈ సినిమా గురించి చదివి డౌన్ లోడ్ చేశా. ఇంకా చూడడం కుదరలేదు. ఈ రోజు చూడాలి.
రిప్లయితొలగించండిమీకవిత బాగుంది.
మీ కవిత బాగుంది. చాలా బాగుంది
రిప్లయితొలగించండి@అజ్ఞాత,మధురవాణి,చెప్పాలంటే,చిన్ని,విశ్వప్రేమికుడు,మందాకిని
రిప్లయితొలగించండిధన్యవాదాలండి. :-)
మీ కవిత చాలా బావుందండి.
రిప్లయితొలగించండిnenu kavithalu chadavadam chala varaku avoid chestanu..konni naku arthamkavu kada, endukule chadivi time waste cheskovadam ani..kani nee kavitha chadivina taruvata telisindi...chala tappu chesanani...mee kavitha..nijamga naku picha picha ga nachesindi.....:) keep rocking
రిప్లయితొలగించండి