చేతినిండా పనుంటుంది... కానీ
సందె వేళ.. హాయిగా ఆరుబయట పచ్చగడ్డిమీద పడుకొని ఆకాశంలోని కొత్త కొత్త రంగుల్ని ఆస్వాదిద్దామనిపిస్తుంది... ఏం చేద్దాం మనసు మాటవినదు
జాబిలి వెన్నెలలో కోనేటి కలువలా నా ముంగిట విచ్చుకున్న నీ అందాన్ని చూస్తూండిపోయిన నన్ను క్షణకాలంలో చెంతకు లాక్కున్నావు... నీ కౌగిట బందించావు...! అమృతం తాగిన పెదవులతో నన్ను తాకి అమరుణ్ణి చేశావు...!!