క్లాసు పక్కనెట్టి
కాలేజీ క్యాంటీన్లో
స్క్వేర్ టేబుల్ మీద
రౌండ్ టేబుల్ ఫార్మ్ చేసి
ప్లేటు నిండా పూరీతో
నోటి నిండా కబుర్లతో
చిట్‌చాట్ మొదలెడితే...
లెక్చరర్ లీవులో,
లాస్టవర్ క్లాసులో,
బ్యాక్ బెంచ్ అడ్డాలో
నోట్‌బుక్ అడ్డుగా...
నిన్న సెకండ్ షో సిన్మా మీద
రివ్యూలు మొదలెడితే...
ఈవెనింగ్ చాట్ దగ్గర
చేతిలో ప్లేటుతో
ప్లేటులో చాటుతో
స్టాండేసిన బైక్ మీద ఆనుకుని
నోటాపిక్నే టాపిక్కనుకుని
జోకేయ్యడం మొదలెడితే...
మనసు మాటల్లో మునిగిపోదూ...!
సమయమే తెలీకుండా...!!