నా కనుబొమ్మల
చల్లని తెరల మీద
మృదువైన స్వప్నంతో
నీ బొమ్మని గీద్దామని
అనుకుంటున్న వేళ.....
అప్పుడే తెల్లవారాలా...!!!
నా కల చెదరాలా...???
చేతినిండా పనుంటుంది... కానీ సందె వేళ.. హాయిగా ఆరుబయట పచ్చగడ్డిమీద పడుకొని ఆకాశంలోని కొత్త కొత్త రంగుల్ని ఆస్వాదిద్దామనిపిస్తుంది... ఏం చేద్దాం మనసు మాటవినదు
30, అక్టోబర్ 2008, గురువారం
5, అక్టోబర్ 2008, ఆదివారం
డియర్ సార్! This is my number
లాస్ట్ పోస్ట్‌లో చెప్పిన లక్ష్మీ సార్ క్లాస్‌లోనే ఇది కూడా రాసింది. సార్ క్లాసులో ఎంత గొడవ చేసినా అరిచేవారు కాదు. స్ట్రిక్ట్‌గా ఉంటేనే అల్లరిచేసేవాళ్ళు,ఇంక లీనియంట్‌గా ఉంటే ఎందుకాగుతారు.. సో ఆ గొడవకి ఎంతోమంది అటెండన్స్ పోయింది. ఒక రోజు నాది కూడా హుష్‌పటాక్... అప్పుడు రాసుకున్నా ఈ "డియర్ సార్! This is my number"
====================
ఇందాక క్లాసు..
అలియాస్ గొడవ
మొదలైన
పావుగంట తర్వాత
ఓ సెక్షన్ అయిపోయింది..
ఏంటో అనుకుంటున్నరా?
ఏం లేదులేండి అటెండెన్స్..!!
ఇంతకీ నా నంబర్ రాలా..!
నాకో డౌట్...!
నా నంబర్ వచ్చిందా!?
మీరు పిలిచారా!?
నాకు వినబడలేదే?
ఎనీ వే..
నాకు మాత్రం మిస్సయ్యింది
టు అవర్స్ అటెండెన్స్...!
వామ్మో..!
2 పెర్సెంటో 3 పెర్సెంటో
ఎంత తగ్గుతాదో...!!
అసలే అటానమస్ స్కీం
ఏం చెయ్యమంటారు..?
మొదట్లో అడక్కూడదనుకున్నా,
ఇంతా ఆలోచించాక
అడక్క తప్పదనుకున్నా...
అందుకే అడుగుతున్నా...
డియర్ సార్..
This is my number.....!!
డియర్ సార్ - I am very sorry
"లక్ష్మీ నారాయణ" సార్..2-2 లో మాకు AEC సబ్జెక్ట్ తీస్కున్నారు..! సార్‌కి experience ఎక్కువ. కానీ.. సార్ వాయిస్ లాస్ట్ బెంచెస్ కి వినబడేది కాదు.. అందుకని ముందుకొచ్చి కూర్చోవాల్సి వచ్చేది..!!ఒకరోజు అలాగే ముందుకొచ్చి కూర్చున్నప్పుడు లాస్ట్ sem లో గంగా సార్ (EDC) వదిలేసిన టాపిక్స్ అన్నీ మేము అప్పుడే నేర్చుకున్నామనుకొని ఈ సార్ కూడా స్కిప్ చేసేశారు... అప్పుడు రాసుకున్నదీ కవిత.."డియర్ సార్!I am very Sorry"
=====================
డియర్ సార్..!
మొదటిసారి
మీ క్లాసు విందామని
తప్పని తెల్సినా..
తప్పక.....
మధ్య రో..లో
మూడో బెంచిలో
మూలన కూర్చున్నా..!!
A4 షీట్స్
పద్నాల్గు తెచ్చుకున్నా!
కొత్త పెన్ను కొనుక్కున్నా!
చెప్పాలంటే సిగ్గేస్తోంది...!
మీరు చెప్పేది బుర్రకెక్కలని
తలకి నూనెకూడా పెట్టా!!
11:05 క్లాసుకి
10:55 కే వచ్చా..
అటెండెన్స్ కూడా
అటెన్షన్‌తో చెప్పా..!
కానీ...,
మా 'గంగా' వదిలేసిన..
అదే ఆయనకీ మాకూ రాని
(వారి భాషలో unimportant)
టాపిక్సన్నీ
మీరు కూడా వదిలేస్తే...!
అర్థమయ్యేదెలా?
మీ భాష అరవమైంది.
పరిస్థితి అర్థమైంది..
కానీ...
వెనక్కి వెళ్ళలేను..!
అలాగని
మీ క్లాసు వినలేను...!!
తెలిసి తెలిసీ..
మొదటిసారి..
ఓ తప్పు చేశా..!!
మీ క్లాసు విందామని
తప్పని తెల్సినా
తప్పక....
మధ్య రో..లో
మూడో బెంచిలో
మూలన కూర్చున్నా..!!
I am very sorry..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)