లాస్ట్ పోస్ట్‌లో చెప్పిన లక్ష్మీ సార్ క్లాస్‌లోనే ఇది కూడా రాసింది. సార్ క్లాసులో ఎంత గొడవ చేసినా అరిచేవారు కాదు. స్ట్రిక్ట్‌గా ఉంటేనే అల్లరిచేసేవాళ్ళు,ఇంక లీనియంట్‌గా ఉంటే ఎందుకాగుతారు.. సో ఆ గొడవకి ఎంతోమంది అటెండన్స్ పోయింది. ఒక రోజు నాది కూడా హుష్‌పటాక్... అప్పుడు రాసుకున్నా ఈ "డియర్ సార్! This is my number"
====================
ఇందాక క్లాసు..
అలియాస్ గొడవ
మొదలైన
పావుగంట తర్వాత
ఓ సెక్షన్ అయిపోయింది..
ఏంటో అనుకుంటున్నరా?
ఏం లేదులేండి అటెండెన్స్..!!
ఇంతకీ నా నంబర్ రాలా..!
నాకో డౌట్...!
నా నంబర్ వచ్చిందా!?
మీరు పిలిచారా!?
నాకు వినబడలేదే?
ఎనీ వే..
నాకు మాత్రం మిస్సయ్యింది
టు అవర్స్ అటెండెన్స్...!
వామ్మో..!
2 పెర్సెంటో 3 పెర్సెంటో
ఎంత తగ్గుతాదో...!!
అసలే అటానమస్ స్కీం
ఏం చెయ్యమంటారు..?
మొదట్లో అడక్కూడదనుకున్నా,
ఇంతా ఆలోచించాక
అడక్క తప్పదనుకున్నా...
అందుకే అడుగుతున్నా...
డియర్ సార్..
This is my number.....!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి