8, నవంబర్ 2008, శనివారం

ఓ సారూ! జరా యినుకో

మూన్నెల్ల సంది చూత్తానే ఉండా
యావైనా చెప్తావేమో ని
నీ చెప్పుడు తో సబ్జెక్టుకే
బద్నాం తెచ్చినావ్..!!
ఒక్కో యూనిట్టుకి
దినాలు వదిలి
నెలల్లెక్క లాక్కుండావ్...!
కండ్లు తెరిసి చూసే తాడికి
పూరా కతమన్నావ్..!!
యింకేముండాది...
మిడ్డు..బొడ్డు.. అని
చానా రాసినాం
గంతే...
నాల్గు దినాల్లో
చివరాకరి ఎజ్జాములు..!!
................................
మావోడు పరీచ్చకెల్లె
ముందే అడిగిండు..
"యామిరా బై..!గా
సాంప్లింగు సదివిన్రా..?" అని
యాలాకోలమాడబాకని..
ఆడ్ని కాతరు చెయ్యలా..!!
నాకేమెరుక..
గా పేపరిచ్చేటోడు
నీ ఇలాకల్నే
ఉండాడని...!
తేజ సైన్మాల్లెక్క
అర్దంగాని తరీకలో ఇచ్చిండు..!
గంతెందుకు సారూ...!
నువ్వు రాసినాగూడా
పాసవ్వుట కష్టమే
ఎరుకనా..!!
.........................
సారూ..!
గీ జిందగీకిది చాలు
మల్లొచ్చి పరేషాన్ చెయ్యబాకు...!!
యాదుంచుకో...!!!

7 కామెంట్‌లు:

  1. పరీక్షల కవిత్వం బావుంది. ఇంతకీ సాంప్లింగ్ అంటే sampling theoremమేనా?

    రిప్లయితొలగించండి
  2. Baagumdi baas mee kavita..manadi same problem any solution pls tell me..vasilisuresh teluguneastamaa..

    రిప్లయితొలగించండి
  3. @poornima - thanks poornima garu... ఔనండి..నేను ECE.....! మీరు కూడా ECE ఏనా...?
    @chaitanya krishna - thanks...ఔనండి.. sampling theorem E......

    రిప్లయితొలగించండి
  4. ఒక్కదెబ్బతో 25 య్ర్స్ వెనక్కి తీసుకెళ్ళావు మిత్రుడా. దేశపు దౌర్భాగ్యపు ఇంజనీరింగు కళాశాలల్లో పరిషితి ఏమాత్రం మారాందుకు చాలా గర్విస్తున్నా.

    రిప్లయితొలగించండి
  5. బాగుందండి మీ కవిత. భలె నవ్వుకున్నాం. మా ఇంజనీరింగ్ రోజులను గుర్తు తెప్పించారు. keep up the good work.

    రిప్లయితొలగించండి