31, డిసెంబర్ 2008, బుధవారం

జ్ఞాపకాల పందిరిలో....!!

వణికించే చలికాలంలో
మొదలయ్యింది యీ సంవత్సరం-
వురికించే ఊహలు రేపింది!
" ఒకే సంవత్సరంలో
మూడు సెమిస్టర్లు!!
ఒక్కోటీ ఒక్కో
అందమైన అనుభవం.
ఆటలూ-పాటలూ
పుస్తకాలూ-పాట్లూ
చిన్ని చిన్ని గొడవలూ
బంకేసిన క్లాసులూ
బుక్కయిపోయిన సీన్లూ
మార్నింగ్‌షో టిక్కెట్లూ
ర్యాంప్‌షో డిస్కషన్లూ
జి టాకులో - ఆఫ్‌లైన్లూ
ఏవో సాకులూ - బి.ఆర్.బి లూ
అర్థం లేని మార్కులు-
అదిరిపడే కలలు!
అమ్మాయితో మాటలు-
అందమైన కలలు!!
పేపర్ ప్రెజెంటేషన్లు-
కట్-కాపీ-పేస్టులు!!!
ఎక్జాంలో ముందువాడి పేపర్లూ
విసుగెత్తించే క్లాస్ టాపర్లూ................"

'ఏంటి యీ సంవత్సరం?'
అని వెనక్కి చూస్తే నా మది
నన్ను తిప్పి తీస్కువచ్చింది -
ఈ అందమైన
జ్ఞాపకాల పందిరిలో....!!

8 కామెంట్‌లు:

  1. వావ్.. చాలా అందంగా చెప్పారు, ఏడాది మొత్తాన్ని ఈ కవితలో..

    పేపర్ ప్రెజెంటేషన్లు-
    కట్-కాపీ-పేస్టులు!!!

    హహహ.. నాకో అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్‍గా మారినా ఇంకా, Ctrl C, Ctrl V రాఘవా అనే పిలుస్తాను. These lines rock.. just as the rest of the post! :-)

    రిప్లయితొలగించండి
  2. బాగుంది మీ కవిత.
    రెండు సంవత్సరాల క్రితం నాటి నా జ్ఞాపకాలను గుర్తుచేసింది.
    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. అబ్బాయ్ఆంగ్లసంవత్సరంఎప్పుడూచలికాలంలోనే కదా వచ్చేది.ఏదో సరదాకన్నాలే ,బాగుంది కవిత.మీకు నా హార్థిక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. Purnima, Rani, Bhavani, Mohan - thanks
    and wish you a happy new year.. :-)

    రిప్లయితొలగించండి