21, సెప్టెంబర్ 2008, ఆదివారం

అనగనగానో...అనుకోకుండానో... మొత్తానికి ఓ రోజు!!

ఎవరు రాశారోగానీ...
"కాలేజి లైఫురా, తెలియనోడు వేస్టురా..." అనీ
కనబడితే మాత్రం కొట్టేద్దామనిపిస్తుంది. అసలాయనకి తెలుసా, కాలేజి లైఫేంటో..!?

ఎవరికన్నా ఆరు రోజులు పనిచేశాక హాయిగా రెస్ట్ తీస్కునేందుకు ఓ హాలిడే...యీ సండే..!

ఓ చక్కని మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేసి,
తీరిగ్గా టీవీ ముందు కూర్చొని,
మార్నింగ్ మార్నింగే మార్నింగ్‌షో మొదలెట్టేసి,
బోరుకొట్టే టైముకి..(ఆకలేసే టైముకి)..
డైనింగ్ టేబుల్ మీద చిన్న యుద్ధం చేసి,
సోఫాలో హాయిగా వెనక్కివాలి,
టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకొని,
ఓ చిన్న కునుకుతీసి,
మళ్ళీ ఫస్ట్ షో మొదలెట్టడానికి ముందు లైట్‌గా టీ తీస్కొని,
టీవీ ముందుకొచ్చేసరికి...
ఫోన్లో ఫ్రెండ్స్ సిన్మా ప్లాన్ తీసుకొస్తే,
హడావుడిగా రెడీ ఐపోయి..
థియేటర్ దగ్గర ప్రత్యక్ష్యమయ్యేసరికి..
ఫ్రెండ్స్ టిక్కెట్స్‌తో రెడీగావుంటే,
రిలాక్స్‌డ్‌గా మూవీ చూసి,
ఇంటికొచ్చేసరికి...
వేడి వేడిగా నీళ్ళు రెడీ ఐపోతే..
తీరిగ్గా జలకాలాడి,
ముందట్లా కాక.. ప్రశాంతంగానే డిన్నర్ చేసి,
మళ్ళీ సెకండ్‌షో మొదలెడదామనుకున్నా...
కళ్ళు మూతలుపడుతుంటే,
అలాగే వచ్చి మంచంమీద వాలిపోయి
హాయిగా నిద్రపోవాలని ఎవరికుండదు...!?

అరె.. ఒక్కరోజులో ఇవన్నీ కంప్లీట్ చెయ్యడమే కష్టం అనుకుంటుంటే,
ఇంక స్టూడెంట్ బుక్‌లో,
కాలేజ్ చాప్టర్‌లో,
అందులోనూ సెమిస్టర్ ఎండింగ్ పేజ్‌లో మరీ కష్టం...
హఠాత్తుగా వచ్చేసే సెషనల్స్, ల్యాబ్ ఇంటర్నల్స్...
చివరగా డ్రాకులాలా... sem-end exams .... ఇంక తీరికెక్కడిది..?
అలాంటప్పుదు పైన చెప్పిన పనుల్లో ఒక్క కాఫీ తాగడమే మిగుల్తుంది... అదీ నిద్రమత్తుపోయి నైటౌట్ చెయ్యడానికి....!!

అందుకనే ఎప్పుడైనా స్టూడెంట్ లైఫ్ గురించి పాటలు పాడినా ఒప్పుకుంటా గానీ...,యీ టైంలో... చచ్చినా ఒప్పుకోను..!!

ఎందుకంటే యిక్కడ హాయిగా ఎంజాయ్ చేద్దాం అనికాదు...
అనగనగా అని చెప్పుకోడానికో..
అనుకోకుండా అని చెప్పుకోడానికో..
ఓ రోజు ఉంది అంతే........ :-))

3 కామెంట్‌లు:

  1. మీ బ్లాగు ఈ రోజే చూసాను, Fresh గా ఉంది. బాగా రాస్తున్నారు.

    "అనగనగా అని చెప్పుకోడానికో..
    అనుకోకుండా అని చెప్పుకోడానికో..
    ఓ రోజు ఉంది అంతే"......నాకు బాగా నచ్చింది.
    మీరు ఇంజనీరింగు చదువుతున్నారా?
    అన్నట్లు మీది గుంటూరా, మాదీ గుంటూరే!!:)
    అవును కానీ, word verification అవసరం ఉందంటారా? మీ బ్లాగుకి వ్యాఖ్యలు కావాలంటే verification తీసి వేయండి.

    రిప్లయితొలగించండి
  2. Awesome dude! Nice write up.

    Title rocks!

    నాకు ఇంజినీరింగ్ అంటే "సోమవారం పొద్దున్నే రాసే ఇంటర్నల్స్" అని మాత్రమే గుర్తుంది. ఇంకేమైనా గుర్తుచేసుకోడానికి ప్రయత్నిస్తే వస్తాయేమో కానీ, ఇంటర్నల్స్ అంటే భలే చిరాకు. ఇరవై మార్కులకి అంత వెధవ న్యూసెన్స్. కాలేజీ లైఫ్ ని అంతగా నేనే ఎంజాయ్ చెయ్యలేకపోయానేమో అనిపించేది. నాలాంటి జీవులు ఉన్నారన్న మాట :-)

    చాలా బాగా రాశారు. ఇలానే "అనుకోకుండా" పోస్టులు రాసేస్తూ ఉండండి. నిశాంత్ - పేరు కూడా రాక్స్!

    రిప్లయితొలగించండి
  3. sunday holiday!!!jolly day!!aa roju full josh n masthi cheyyalani manasu aaratapaduthundi..
    kaani em chestham?:-(nish pyna cheppinattu ga ila vachi ala vellipothundi sunday!:)naaku idi chusthe okate anipisthundi..:-)."ADAGALI ANI UNDI OKA DOUBT NI SUNRISE LENI DAY EDANI??"mana bsy life antha start ayeddi aa oka sunrise thone kadaa?:-(

    రిప్లయితొలగించండి