-------------------------------------
మూడో క్లాసు పిల్లాణ్ణి ఆపి అడిగినా చెప్తాడు 'నెట్' అంటే "వల" అని. ఆ చింటూ గాడు ఏదనుకొని చెప్పినా మనం ఫీలయ్యే మీనింగే చెప్తాడు.. నిజంగా నెట్టో వల.. సర్ఫింగూ, సెర్చింగూ, బ్లాగింగూ, స్క్రాపింగూ... ఇలా చెప్తూపోతే అబ్బో చాలానే ఉంటాయిలే..!! చూశారా మళ్ళీ మర్చిపోయాను. అదేనండీ పైన రాసిన ఇంగుల్లో.. ఇంకో ఇంపార్టెంట్ ఇంగ్.....'చాటింగ్' :-) దీనికిగాని క్యాప్షన్ పెట్టమంటే నా ఓటు .... "ఫెవికాల్"కే..
system స్టార్ట్ చెయ్యగానే ఆటోమ్యాటిగ్గా start-up లో ఉండే ఆ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కాస్తా అలా start ఐపోయి....అలా అలా YM కాస్తా ఓపెన్ అయిపోయి...(ఆల్రెడీ 'ఆటోమాటిక్ లాగిన్' క్లిక్ చేసుంటుందిలెండి)..! ఇంకేముంది, అలా అలా అలా... hi..hii..hahahai అనే పాపప్స్ ...
ఇంక గడియారంలో ముల్లు .. మున్నాభాయ్‌లో చెప్పినట్టు పరిగెడుతుంది చూడండి.. గంటలు నిమిషాలు కాదుకదా సెకన్లు అవుతాయి. ఇవి చాలక గూగుల్ chrome ఒకటి, ఓపెన్ చెయ్యగానే ఆర్కుట్ ప్రొఫైల్ thumnailలో కనబడేసరికి కర్సర్ కాస్తా అటువెళ్ళిపోతుంది...(అదేగా వల) ఇక్కడ మళ్ళీ స్క్రాపులూ.. అప్‌కమింగ్ బర్త్‌డేసూ.. న్యూ ఫ్రెండ్ రెక్వెస్ట్సూ....... సారీ వీటి గురించి మొదలుపెడితే మళ్ళీ ఓ కొత్త పోస్టు రెడీ అవుతుంది..
మరి ఇన్ని విషయాలు తెలిసినా మళ్ళీ మళ్ళీ నెట్‌కి కనెక్ట్ అవుతున్నామే....! ఇదే కదండీ వల అంటే.... :-)
నిజమే.. చాటింగ్ ఉంటూ టైమ్ అసలు తెలీదు. హమ్మ్.. అంతర్జాలం అను జాలంలో మనం పూర్తిగా చిక్కుకుపోయాము. కాస్త డిసిప్లెన్ ఉంటే ఫర్వాలేదు అనిపిస్తుంది కానీ, ఎక్కడుందీ ఆ డిసిప్లెన్!
రిప్లయితొలగించండిఇదే కదండీ వల అంటే.... :-)
రిప్లయితొలగించండిసాగరానికి ఫిషింగ్ ఏ నెట్ ..ప్రేమించడానికి ఇంటెర్నెట్ .....
రిప్లయితొలగించండిalantappudu youth ki craze net mede kadandi:_)..